ముంబై : పెండ్లి పేరుతో ప్రియురాలిని లోబరుచుకుని ఆపై ఆమెకు అబార్షన్ చేయించి మరొక యువతితో పెండ్లికి సిద్ధమైన వ్యక్తి (29)ని కళ్యాణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి జిల్లాకు చెందిన అజయ్ ఫ్రాన్సిస్ అలియాస్ విక్కీ కళ్యాణ్‌లోని శివాజీ కాలనీలో నివసిస్తూ రైల్వేలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు.
కళ్యాణ్‌కు చెందిన మహిళతో పెండ్లి పేరుతో దగ్గరై సంబంధం ఏర్పరచుకున్న విక్కీ ఆమెను మోసం చేశాడు. తనను పెండ్లి చేసుకుంటానని లోబరుచుకుని గర్భవతిని చేశాడని, ఆపై అబార్షన్ చేయించి గ్రామంలో మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి విక్కీ స్వగ్రామానికి చేరుకున్నారు. మరో యువతితో వివాహానికి సిద్ధమైన విక్కీని పెండ్లికి గంట ముందు అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ్ సెషన్స్ కోర్టు ఎదుట నిందితుడిని హాజరుపరచగా పోలీస్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.