భోపాల్: దివ్యాంగుడైన తండ్రి 14 ఏండ్ల కుమార్తెను హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై కామ వాంఛ తీర్చుకున్నాడు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బజరంగ్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైతా డోంగర్ గ్రామానికి చెందిన 40 ఏండ్ల దివ్యాంగుడు మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలిక కోసం స్థానికులను ఆరా తీశారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు ఆమె తండ్రితోపాటు ఇంట్లోనే ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
దీంతో తండ్రిని అనుమానించిన పోలీసులు బుధవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో జరిగిన విషయాన్ని వెళ్లడించాడు. కుమార్తెపై లైంగిక దాడి కోసం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దండోలి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతునులిమి హత్య చేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహంపై లైంగికదాడికి పాల్పడినట్లు వెల్లడించాడు.
దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి బాలిక మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనా స్థలంలో నేర సంబంధ ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దారుణానికి పాల్పడిన దివ్యాంగుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.