అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో ఓ లెక్చరర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబేద్కర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న తాళ్లూరి జక్కరయ్య (50) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్‌ను అక్కడ ఉంచాడు. సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకొన్న పోలీసులు విచారణ ప్రారంభించారు.