కేరళలో దారుణం… మహిళల నరబలి, నరమాంస భక్షణం
మహిళల చేతులు కట్టి క్షద్ర పూజల కోసం ప్రైవేట్ భాగాల్లో కత్తితో పొడిచి హత్య చేశారు. నిందితురాలైన లైలా ఆ మహిళ మాంసాన్ని వండగా ముగ్గురు నిందితులు నర మాంసం తిన్నారు. మరో మహిళ మాంసాన్ని ఉప్పులో ఉంచి నిల్వ చేశారు.
తిరువనంతపురం: కేరళలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వడంతో పాటు నర మాంసాన్ని వండుకుని తిన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పతనంతిట్ట జిల్లా ఎలంతూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. జూన్ నెలలో రోసెలిన్ అనే మహిళ అదృశ్యమైంది. అలాగే సెప్టెంబర్లో పద్మ అనే వృద్ధురాలు కూడా కనిపించకుండాపోయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, క్షుద్రపూజలు చేసే మహ్మమద్ షఫీ వద్ద పద్మ మొబైల్ ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారణ జరుపగా షాకింగ్ విషయాలు చెప్పాడు. రోసెలిన్, వృద్ధురాలు పద్మతో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని వారిని లోబరుచుకున్నాడు. డబ్బులు ఆశ చూపి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న భగవాల్ సింగ్, లైలా దంపతుల ఇంటికి ఆ మహిళలను విడివిడిగా పంపాడు.

ఆ ఇంట్లో మహిళల చేతులు కట్టి క్షద్ర పూజల కోసం ప్రైవేట్ భాగాల్లో కత్తితో పొడిచి హత్య చేశారు. నిందితురాలైన లైలా, మహిళ మాంసాన్ని వండగా ముగ్గురు నిందితులు నర మాంసం తిన్నారు. మరో మహిళ మాంసాన్ని ఉప్పులో ఉంచి నిల్వ చేశారు. వృద్ధురాలు పద్మ శరీరాన్ని 56 ముక్కలుగా నరికి ఒక బకెట్లో ఉంచి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పచ్చి నర మాంసాన్ని కూడా తిన్నట్లు అనుమానిస్తున్నారు. భగవాల్ సింగ్ ఇంటి ప్రాంగణంలో మూడు చోట్ల గోతిలో పాతి పెట్టిన ఇద్దరు మహిళల శరీర భాగాలను వెలికి తీసి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

