మరో ముగ్గురికి ట్రాఫిక్ సర్వీస్ డ్యూటీ
మన్సూరాబాద్ : ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం ఎల్బీనగర్లోని ఆరవ ఎంఎం స్పెషల్ కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష మరో ముగ్గురు వ్యక్తులకు మూడు రోజుల ట్రాఫిక్ సర్వీస్ డ్యూటీ విధించినట్లు ట్రాఫిక్ సీఐ పి. వెంకటేశ్వర్లు తెలిపారు.
మన్సూరాబాద్‌కు చెందిన వి. రాజు (28), దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వెంకటేష్ (37)కు జైలు శిక్ష పడిందని ఆయన తెలిపారు. మద్యం తాగి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎవరూ ఊహించని ప్రదేశాలలో ప్రతి రోజు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.