కందుకూరు : జైల్లో పరిచయం అయిన దొంగలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో భార్యాభర్తలు, కుమారుడితో పాటు 5మంది ఉన్నారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ బాలక్రిష్ణరెడ్డి, సీఐ కృష్ణంరాజు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అనుముల గ్రామానికి చెందిన సంపంగి వెంకన్న ( 55), శారధ (45) భార్యాభర్తలు, వారి కుమారుడు వెంకన్న (23) లు పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లారు.
జైల్లో వీరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కోడి రామ్మూర్తి , నల్గొండ జిల్లా గుడపూరు గ్రామానికి చెందిన వేంరెడ్డి శ్రీనివాసరెడ్డి (38) లు పరిచయం అయ్యారు. వీరందరిపై గతంలో పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నాయి. అయిన వీరి ప్రవర్తన మారలేదు. తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఈ ముఠా మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ నెల 6న పక్కనే ఉన్న చీమల మంజులదంపతులు నిశ్చితార్థానికి వెళ్లగా తాళం పగుల గొట్టి ఇంట్లో ఉన్న 1లక్షా50 వేల రూపాయలు, 13తులాల వెండి దొంగతనం చేసి పరారయ్యారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ క్రిష్ణంరాజు ఆధ్వర్యంలో ఎస్సై శ్రావణ్ విచారణ చేపట్టారు. కాగా వారిపై వచ్చిన అనమానంతో ఇల్లును పరిశీలించిగా సజ్జపై పడేసిన రోల్డ్ గోల్డ్ దొరికింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతానికి పాల్పడినట్లు అంగీరించారు. లోతుగా విచారించగా 3కేసుల్లో 2లక్షల 13వేల రూపాయలను దొంగిలించినట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
వారి వద్ద నుంచి లక్షా, 77వేల రూపాయలు టాటా ఏసీ ఆటో, సీబీజడ్ బైక్, 4 సెల్ పోన్లు , ఏడున్నర తులాల వెండి స్వాధీనం చేసు కున్నట్లు చెప్పారు. దొంగిలించిన సొత్తుతో జల్పాలకు పాల్పడిన వీరు మిగిలిన డబ్బులను కొత్తూరు గేటు వద్ద గుంతలో దాచి పెట్టా రు. కాగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు స్వామి, కొండల్, పోలీసులు పాల్గొన్నారు.