Nagpur | తన ప్రియురాలి( Lover )తో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ ఆ ఎంజాయ్ తన శక్తికి మించి చేయాలనుకున్నాడు. అందుకని శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మద్యం సేవిస్తూ వయాగ్రా పిల్స్( Viagra Pills ) వేసుకున్నాడు. దీంతో అతని రక్తం గడ్డ కట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాగ్‌పూర్( Nagpur )లో చోటు చేసుకున్నట్లు ఫోరెన్సిక్, లీగల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 41 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఆ రాత్రి మద్యం సేవించాడు. ఇక మద్యం సేవిస్తూనే 50 ఎంజీ చొప్పున ఉన్న రెండు వయాగ్రా పిల్స్‌ను వేసుకున్నాడు. ఆ రాత్రంతా వ్యక్తి బాగానే ఉన్నప్పటికీ తెల్లారేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
తెల్లవారుజామున వాంతులు చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రికి వెళ్దామని ప్రియురాలు చెప్పినప్పటికీ అతను వినిపించుకోలేదు. గతంలోనూ ఇలాగే అయిందని చెప్పి ఊరుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చేసేదేమీ లేక అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
వయగ్రా పిల్స్ వేసుకోవడం వల్ల క్రమక్రమంగా అతని మెదడుకు ఆక్సిజన్( Oxygen ) సరఫరా తగ్గిపోయి సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్( cerebrovascular haemorrhage ) ఏర్పడటంతో.. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యంతో కలిపి వయగ్రా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యాడని, తద్వారా ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
వైద్యుల సలహా లేకుండా అంగస్తంభన కోసం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును ప్రచురించినట్లు జర్నల్‌లో పేర్కొన్నారు.