జైపూర్: ఒక వ్యక్తి మద్యం మత్తులో పొరుగింటి వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 70 ఏళ్ల వృద్ధురాలు మంచంపై నిద్రిస్తున్నది. ఏనిమిదేళ్ల మనవడు కూడా ఆమె పక్కన పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఆమె భర్త పశువులను మేపేందుకు బయటకు వెళ్లాడు. పశు గ్రాసం కత్తిరించడంలో కోడలు బిజీగా ఉన్నది. ఇంతలో పొరుగున ఉండే 32 ఏళ్ల వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చాడు. మంచంపై పడుకున్న వృద్ధురాలిని బలవంతంగా వంటగదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఇంటికి తిరిగి వచ్చిన భర్త, తన భార్యకు తీవ్ర రక్తస్రావం కావడాన్నిగమనించాడు. వెంటనే ఆమెను బండికూయ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధురాలి ప్రైవేట్ భాగంలో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉండటంతో జైపూర్లో పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు.
మరోవైపు ఆ వృద్ధురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పొరుగింటి వ్యక్తిపై రేప్ కేసు నమోదు చేశారు. పరారిలో ఉన్న అతడి కోసం వెతుకుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని పొరుగున ఉన్న కొందరు తెలిపారు.