జైపూర్ : రాజస్ధాన్ రాజధాని జైపూర్‌లో దారుణం వెలుగుచూసింది. నగరంలోని హోటల్లో మసాజ్ పేరుతో విదేశీ వనితపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెదర్లాండ్స్‌కు చెందిన మహిళ రాజస్ధాన్‌ను సందర్శించేందుకు జైపూర్‌లోని సింధి క్యాంప్ ప్రాంతంలోని హోటల్లో బస చేయగా కేరళకు చెందిన నిందితుడు ఆయుర్వేద మసాజ్ ఏర్పాటు చేస్తానని లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జైపూర్‌లోని ఖటిపురాలో నిందితుడు మసాజ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు నేరానికి పాల్పడిన అనంతరం కేరళకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ వెస్ట్ రిచా తోమర్ వెల్లడించారు.