లక్నో : యూపీ రాజధాని లక్నోలో మహిళ బలవన్మరణానికి యత్నించడం కలకలం రేపింది. లక్నోలోని బీజేపీ కార్యాలయం ఎదుట శుక్రవారం మహిళ తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో కాషాయ పార్టీ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు మహిళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
మహిళ ఎందుకు తీవ్ర నిర్ణయం తీసుకున్నదో తెలుసుకునేందుకు బాధితురాలిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉన్నావ్ సామూహిక లైంగిక దాడి బాధితురాలు యూపీ సీఎం నివాసం వెలుపల 2017లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతాన్ని ఈ ఘటన జ్ఞప్తికి తీసుకువచ్చింది. ఇక బీజేపీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్య యత్నంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.