అహ్మదాబాద్ : ఫోన్లో నగ్న చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు పంపుతూ తన బావ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అహ్మదాబాద్‌లోని జుహరపుర ప్రాంతానికి చెందిన మహిళ (27) బుధవారం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు తరచూ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని, ఫోన్లో నగ్నచిత్రాలు, అశ్లీల మెసేజ్‌లు పంపుతున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
కుటుంబ గొడవలతో 2020 ఆగస్ట్‌లో జరిగిన తన వివాహానికి అక్కా, బావలను పిలవకపోవడంతో అప్పటి నుంచి బావ వేధింపులు మొదలయ్యాయని తెలిపింది. తన కోరిక తీర్చాలని లేకుంటే అశ్లీల మెసేజ్‌లు, నగ్నచిత్రాలను మీ భర్తకు పంపుతానని కూడా బెదరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన మార్ఫింగ్ ఫోటోలను పంపి వాయిస్ మెసేజ్‌లతో వేధించాడని తెలిపింది.
విషయం బయటపడితే కుటుంబం పరువు పోతుందని, భర్త తనకు విడాకులు ఇస్తాడనే భయంతో తనలో తానే కుమిలిపోయానని పేర్కొంది. రోజురోజుకూ నిందితుడి ఆగడాలు శ్రుతిమించడంతో విషయం భర్తకు చెప్పానని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో వెజాల్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించానని తెలిపింది. నిందితుడిపై ఐటీ చట్టం సహా లైంగిక వేధింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.