దారుణం : బాలికపై సామూహిక అత్యాచారం..మరో ఫ్రెండ్‌కు ఘటన లైవ్ స్ట్రీమింగ్!
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. 16 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మరో స్నేహితుడికి ఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలో వెలుగుచూసింది.
భోపాల్ : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. 16 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మరో స్నేహితుడికి ఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ రాజీవ్ గుప్తా తెలిపారు.
బాలిక శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. జూన్ 2న దాదాపు 21 ఏండ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు తనను హోటల్‌కు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఫిర్యాదు చేసింది. నిందితులు ఘటనను మరో ఫ్రెండ్‌కు లైవ్ స్ట్రీమింగ్ చేశారు.
ఫోటోలు, వీడియోలు తీసి ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులు వెల్లడించారు. గతంలోనూ వీరు ఇదే తరహా నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితులపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- Girl
- live stream
- men
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

