అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం వెలుగుచూసింది. వెరవాల్ పట్టణ సమీపంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్ధినిని ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. రాజ్‌కోట్‌కు సమీపంలోని మధసురియాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ భరత్ జర్సనియాపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రిన్సిపల్ భరత్ జర్సనియ బాలిక చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి గ్రామస్తులను వెంటబెట్టుకుని వెళ్లి ప్రిన్సిపల్‌ను నిలదీశాడు. క్షమాపణలు కోరిన ప్రిన్సిపల్ రాజీ పడదామని ప్రతిపాదించగా గ్రామస్తులు నిరాకరించారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గ్రామస్తులు కీచక ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా ప్రిన్సిపల్ తమను కూడా లైంగిక వేధింపులకు గురిచేశాడని మరికొందరు విద్యార్ధినులు కుటుంబ సభ్యులకు తెలిపారు.