పట్నా : భార్య వేరొకరితో సన్నిహితంగా ఉన్నప్పుడు భర్త కంటపడటంతో దారుణం జరిగింది. తమ గుట్టు రట్టవడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తను మహిళ కడతేర్చింది. బిహార్‌లోని పుర్నియ జిల్లా చకర్పద గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితుడిని పోషిత్ కుమార్‌గా గుర్తించారు.
కుమార్ భార్య సావిత్రి దేవి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగిఉంది. కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో భార్య సావిత్రి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూసి కంగుతిన్నాడు. తమ బండారం బయటపడటంతో సావిత్రి ప్రియుడు మహల్దార్‌తో కలిసి కుమార్ మెడకు తాడు బిగించి ఉసురు తీసింది.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కుమార్, సావిత్రిలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కుమార్, సావిత్రిలకు పదేండ్ల కిందట వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.