Illicit liquor | చేతి పంపు నుంచి ఉబికి వచ్చిన మద్యం.. నిశ్చేష్టులైన గుణ పోలీసులు
Illicit liquor | మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో కల్తీ మద్యం ఏరులైపారుతున్నది. గ్రామాల్లో కల్తీ మద్యందారులు భూమిలో ట్యాంకులు పెట్టి వాటిపై చేతి పంపులు అమర్చి మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పలుసార్లు దాడులు చేస్తున్నా అసలు నిందితులు మాత్రం..
Illicit liquor | కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని బయల్దేరిన పోలీసులకు ఊరావల చేతి పంపు కనిపించింది. దాని హ్యాండిల్‌ను కొట్టగానే మద్యం ఉబికి వచ్చింది. గుప్పుమని కల్తీ మద్యం బయటకు రావడంతో దాడులకు వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు నిశ్చేష్టులయ్యారు. చేతి పంపును కొట్టికొట్టీ బ్యారెళ్లను నింపి మరీ కల్తీ మద్యంను ధ్వంసం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని గుణ పోలీసులు కల్తీ మద్యం కోసం గ్రామాల్లో తనిఖీలు చేశారు. దూరంగా ఉన్న రెండు గ్రామాలకు వెళ్తుండగా పడావు పొలాల మధ్య చేతి పంపులాంటిది కనిపించింది. చేతి పంపు ఇక్కడ ఉండటమేంటని దాని హ్యాండిల్‌ను కొట్టి చూడగా మద్యం ఉబికి వచ్చింది. దాంతో దాడులకు వచ్చిన పోలీసులు ఆశ్చర్యపోయారు. చేతి పంపు సాయంతో కల్తీ మద్యంను బ్యారెళ్లలో నింపి ధ్వంసం చేశారు. చేతి పంపు ఉన్న ప్రాంతంలో 7 ఫీట్ల లోతులో పెద్ద ట్యాంకర్‌ను ఏర్పాటుచేసిన మద్యం మాఫియా.. ఇక్కడి నుంచి గ్రామాలకు కల్తీ మద్యంను సరఫరా చేస్తుంది.

సోమవారం గుణ పోలీసులు దాడులు చేసి పెద్ద మొత్తంలో కల్తీ మద్యంను ధ్వంసం చేశారు. పోలీసుల రాక గమనించిన నిందితులు పరారయ్యారు. కాగా, కల్తీ మద్యం మాఫియా నడుపుతున్న వ్యక్తులను పోలీసులు గుర్తించి 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. చంచోడా ప్రాంతంలోని భన్పురా గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కంజర్ కమ్యూనిటీ ప్రజలు నివసిస్తున్నారు. గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబం కల్తీ మద్యం తయారీలో ఉంటున్నది. పలుచోట్ల మద్యం బట్టీలు ఏర్పాటు చేసి కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. రఘోఘర్ ప్రాంతంలోని సకోన్యా గ్రామంలో కూడా పెద్ద మొత్తంలో కల్తీ మద్యం తయారవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

