Hyderabad | హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీ తాగుదామని బీటెక్ విద్యార్థినిని బయటకు తీసుకొచ్చిన క్లాస్మేట్.. తన రూమ్‌కి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో ఉండగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల విజయ్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే క్లాస్‌లో చదువుతున్న ఓ యువతితో అతనికి స్నేహం ఉంది. ఆ పరిచయంతోనే ఈ నెల 14వ తేదీన రాత్రి టీ తాగుదామని పిలిచాడు. అందుకు ఆమె అంగీకరించడంతో తన కారులో దిల్సుఖ్నగర్ తీసుకెళ్లాడు. అనంతరం ఇబ్రహీంపట్నం తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బీడీఎస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి యువతినిక తీసుకెళ్లాడు. అక్కడ యువతితో అతను మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
తెల్లారి మత్తు దిగిన తర్వాత లేచి చూసేసరికి తనపై అత్యాచారం జరిగిందని బీటెక్ విద్యార్థిని గుర్తించింది. స్నేహితుడు అని నమ్మి వస్తే ఇంతటి ఘోరానికి పాల్పడతాడా? అని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.