న్యూఢిల్లీ : యూట్యూబ్ వీడియోలను (YouTube videos) లైక్ చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించవచ్చని మభ్యపెట్టి పలువురి నుంచి రూ. 73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్, మోజ్ యాప్‌ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్లైన్ ఫ్రాడ్‌కు తెరలేపింది. నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్‌కుమార్‌ను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమార్ గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్‌ను లైక్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని నమ్మబలికాడు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు.
ఆపై కుమార్ పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్దమొత్తంలో నష్టపోయాడు. ఇలా మరికొందరినీ మోసం చేసి పెద్దమొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలకూ డబ్బు చేరవేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
గార్బా నృత్య ప్రదర్శనల్లో గుండెపోటుతో 10 మంది మృతి