హైదరాబాద్ : ఏసీబీ అధికారులకు మరో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడ్డాడు. కరీంనగర్ ( Karimnagar ) జిల్లా శంకరంపేట మండలం పరిధిలోని మోలంగూర్ గ్రామ పాలన అధికారి కాంపేటి శ్రీనివాస్( GPO Srinivas ) బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు ( ACB Raids ) రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
స్వయంగా ఫిర్యాదుదారుడు తయారు చేసిన భూమి సర్వే నివేదికకు రిజిస్ట్రేషన్ , పట్టాదారు పాస్ బుక్ జారీ చేయాలని జీపీవోను సంప్రదించాడు. అందుకు ప్రతిఫలంగా 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇవ్వగా మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జీపీవోపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని అధికారులు వివరించారు.