చెన్నై : తమిళనాడులో సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఏడేండ్ల బాలికపై తాత, మేనమామ, సోదరుడు పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మడిపాక్కం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఆన్లైన్ క్లాసులకు హాజరవుతుండగా తల్లి ఇంటి పనులతో బిజీగా ఉండటంతో మనవరాలిని తనతో పాటు మడిపాక్కంలోని ఇంటికి తాత (62) తీసుకునివెళ్లాడు.
ఆగస్ట్ 2న బాలిక రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో తాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై మేనమామ (42) సైతం బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో బాలిక వరుసకు సోదరుడి (16)తో విషయం పంచుకోగా అతడు కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు.
ఇక బాలిక తల్లి కూతరును చూసేందుకు ఆదివారం నిందితుడి ఇంటికి రాగా జరిగిన విషయం తెలిసింది. చికిత్స నిమిత్తం బాధిత బాలికను దవాఖానకు తరలించారు. పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.