లక్నో : యూపీలో బాలికలు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమేధి జిల్లాలో 11 ఏండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలిక మేకలను మేపేందుకు పొలానికి తీసుకువెళ్లగా దారికాచిన యువకుడు(20) ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి వచ్చిన అనంతరం కుటుంబ సభ్యులకు విషయం తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలిని ప్రతాప్ఘఢ్లోని జిల్లా దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.