ఇస్లామాబాద్ : 16 ఏండ్ల బాలికను అపహరించి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెండ్లి జరిపించిన ఘటన కలకలం రేపింది. బాలికను కిడ్నాప్ చేసే ముందు ఆమెను ఇస్లాంలోకి మతమార్పిడి జరిపించారు.
ఈ ఘటనకు నిరసనగా నవాబ్‌షాలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలి జర్దారీ నివాసం ఎదుట హిందూ సంఘాల సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బాలికకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని జర్ధారీని వారు కోరారు. సింధ్ ప్రావిన్స్‌లోని ఖ్వాజి అహ్మద్ నుంచి గత వారం బాలికను అపహరించారని పాక్ పత్రిక డాన్ తెలిపింది.