ఢిల్లీ కోర్టులో ఫైరింగ్.. గ్యాంగ్‌స్టర్ జితేంద్ర హతం

న్యూఢిల్లీ : ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేంద్ర అలియాస్ గోగిపై కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులు జరిపారు. ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం రోహిణి కోర్టుకు వచ్చిన జితేంద్రను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో జితేంద్ర సహా నలుగురు మరణించారు.
న్యాయవాదుల మాదిరిగా కోర్టు ఆవరణలోకి వచ్చిన ఆగంతకులు దాడికి తెగబడ్డారు. దాడిలో పాల్గొన్న ఇద్దరిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ హతమార్చింది. ప్రత్యర్ధి గ్యాంగ్‌కు చెందిన వారే గ్యాంగ్‌స్టర్ జితేంద్రపై కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో జితేంద్ర తరపు న్యాయవాదికి గాయాలయ్యాయి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Delhi
- gangstar
- Shot dead
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

