
హిమాయత్‌నగర్ : సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిదిలో చోటు చేసుకుంది. సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం…
హైదర్‌గూడలో నివాసం ఉండే జెన్నిఫర్ రెబెక్కా ఫ్రాంక్లిన్‌కు ఇటీవల గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి సింగపూర్‌లో ఉద్యోగం కల్పి స్తామని చెప్పి నమ్మించాడు.రిజిస్టేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట విడుతల వారీగా రూ.65 వేలను గూగుల్ పేతో తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు.
అతనికి వచ్చిన సెల్‌ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు జెన్నిఫర్ రెబెక్కా ఫ్రాంక్లిన్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.