మైలార్‌దేవ్‌పల్లి : నడుస్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో ఓ ఫంక్షన్‌కు హాజరైన ఇక్బాల్ కుటుంబం వ్యాగనార్ సీఎన్జీ కారులో తిరిగి ఇంటికి వస్తుండగా దుర్గానగర్ చౌరస్తా వద్దకు రాగానే కారు ముందు భాగం ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కారు డ్రైవర్ గమనించడంతో కారులో ఉన్న కుటుంబ సభ్యులను వెంటనే కిందకి దించేశాడు. మంటలను ఆర్పడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కారు అగ్నికి పూర్తిగా కాలి బూడిదగా మారింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు ఇంజన్ భాగంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.