హైదరాబాద్ : పాతబస్తీలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ స్పెషల్ టీమ్స్ ఇవాళ తనిఖీలు చేపట్టాయి. చెలపురాలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన బాణా సంచాను పోలీసులు కనుగొన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ ఫైర్ క్రాకర్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ బాణాసంచా విలువ రూ. 19.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి, చెలపురాలో నిల్వ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ గోడౌన్ యజమాని అనిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన 108 రకాల బాణాసంచాను గుర్తించారు పోలీసులు. అనిల్ కుమార్‌ను చార్మినార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.