Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నేతాజీనగర్లోని ఏషియన్ బ్యారల్స్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.