యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతులను హైదరాబాద్కు చెందిన చెరుకూరి సురేశ్(40), శ్రేష్ఠ(6)గా పోలీసులు గుర్తించారు.
మృతుడు సురేశ్ హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్లో పని చేస్తున్నట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలతోనే సురేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.