మేడ్చల్ మల్కాజ్గిరి : సుచిత్రలో నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ఓ మెడికల్ షాపు నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఇంజెక్షన్లను ఒరిజినల్ స్టిక్కర్ వేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. తనిఖీలు నిర్వహించి నకిలీ బ్లాక్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో సెర్చ్ చేసి నకిలీ ఇంజెక్షన్లు తయారు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి ఆ మెడిసిన్ తయారీకి సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.