ముంబై : మహారాష్ట్రలోని థానేలో దారుణం వెలుగుచూసింది. ఆడ కుక్కపై రెండేండ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న 60 ఏండ్ల వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధుడి నిర్వాకాన్ని కొందరు పిల్లలు రికార్డు చేసి ఆన్లైన్లో వీడియోను పోస్ట్ చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.
ఈ వీడియోను కొందరు జంతు ప్రేమికురాలు రేఖా రేడ్కర్కు వాట్సాప్ ద్వారా పంపడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన దొంబివ్లి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అనుమానితుడిని కళ్యాణ్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన శ్రీసాగర్ అలియాస్ అప్పగా గుర్తించారు.
జంతువులపై పశు వాంఛ తీర్చుకునే ఉదంతాలు పెచ్చుమీరుతున్నాయని వీరికి కఠిన శిక్ష పడేలా చట్ట నిబంధనలను కఠినతరం చేయాలని జిల్లా పశు సంక్షేమ అధికారి, భారత జంతు సంక్షేమ మండలి సభ్యులు మిథేష్ ఎస్ జైన్ పేర్కొన్నారు. ఇక నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు.