శనివారం 16 జనవరి 2021
Crime - Oct 03, 2020 , 10:20:43

17 కోట్ల విలువైన 33 కిలోల బంగారం పట్టివేత

17 కోట్ల విలువైన 33 కిలోల బంగారం పట్టివేత

కోల్‌కతా: మయన్మార్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 33.532 కిలోల బంగారాన్ని డైరెక్ట‌రేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) అధికారులు పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో జ‌ప్తు చేశారు. బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న నలుగురు వ్యక్తులను శుక్ర‌వారం రాత్రి అరెస్ట్‌ చేశారు. వారిని రాజ‌స్థాన్‌కు చెందిన‌వారుగా గుర్తించారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సిలిగురిలో డీఆర్ఐ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఓ లారీని తనిఖీ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల లగేజీ బ్యాగుల్లో 202 బంగారం కడ్డీలు దొరికాయి. అవి 33.532 కిలోలు ఉంటాయని, వాటి విలువ రూ.17.51 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.  

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో దాదాపు 300 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.115 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అదేవిధంగా ప్ర‌స్తుత ఆర్థిక ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 98 కిలోల బంగారాన్ని ప‌ట్టుకున్నామ‌ని, దాని విలువ‌ రూ.52 కోట్లు ఉంటుంద‌న్నారు.