ముంబై: క్లినిక్‌ను ఆలస్యంగా తెరిచినందుకు డాక్టర్, ఆయన కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాంగ్వి ప్రాంతానికి చెందిన డాక్టర్ యువరాజ్ గైక్వాడ్ తన ఇంట్లోనే వైద్యశాల నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం వేళ సమయానికి క్లినిక్ డోర్ తెరువలేదు. భోజనం చేసిన తర్వాత ఆలస్యంగా వైద్యశాల డోర్ తెరిచాడు. కాగా, చాలా సేపు బయట వేచి ఉన్న ఒక రోగికి చెందిన ఆనంద్ అలియాస్ అనిల్ జగ్తాప్, విశ్వజీత్ జగ్తాప్, అశోక్ జగ్తాప్, భూషణ్ జగ్తాప్ ఒక్కసారిగా ఆ క్లినిక్ గదిలోకి చొరబడ్డారు. డాక్టర్ గైక్వాడ్‌తోపాటు అతడి కుమారుడిపై దాడి చేశారు. ఒకరికొకరు తోసుకుని కొట్టుకున్నారు. ఈ సంఘటనతో ఆ ఇంట్లో ఉన్న మహిళలు భయాందోళన చెందారు.
కాగా, డాక్టర్ యువరాజ్ గైక్వాడ్ ఫిర్యాదుతో దాడి చేసిన నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ క్లినిక్ రూమ్‌లో ఉన్న సీసీటీవీలో ఈ సంఘటన రికార్డు అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कैसे- कैसे लोग…!?
बारामती के सांगवी में एक आयुर्वेदिक #Doctor ने देर से दरवाजा खोला तो मरीज के साथ आए लोगों ने डॉक्टर और उनके बेटे की जमकर पिटाई कर दी!
मालेगांव पुलिस #FIR दर्ज कर जांच कर रही है। @ndtvvideos@ndtvindia pic.twitter.com/9deiLBsopZ— sunilkumar singh (@sunilcredible) September 11, 2022