Google pay crime | గూగుల్ పే నుంచి డబ్బులు పోయాయంటూ ఫిర్యాదు.. దర్యాప్తులో పట్టుబడ్డ కీచకుడు
Google pay crime | తన ఫోన్లో గూగుల్ పే నుంచి రూ.19,000 పోయాయంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు ఎవరి ఖతాలోకి వెళ్లాయని సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తే ఒక కీచకుడు లాంటి వ్యక్తి బండారం బయటపడింది

తన ఫోన్లో గూగుల్ పే నుంచి రూ.19,000 పోయాయంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు ఎవరి ఖతాలోకి వెళ్లాయని సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తే ఒక కీచకుడు లాంటి వ్యక్తి బండారం బయటపడింది. అదెలాగంటే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన నంద లాల్(45) అనే వ్యక్తి తన గూగుల్ పే ఖాతా నుంచి రూ.19,000 దొంగలించబడ్డాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు ఒకేసారి కాకుండా పలు మార్లు చిన్న మొత్తాలలో పోయినట్ల తెలిసి పోలీసులు ఎవరో తెలిసిన వారే ఈ పనిచేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తరువాత దర్యాప్తు కొనసాగించి ఆ రూ.19,000 జస్వంత్ సింగ్ అనే వ్యక్తి అకౌంట్లో పడినట్లు గుర్తించారు.
జస్వంత్ సింగ్‌ని పోలీసులు ప్రశ్నించగా.. ఆ డబ్బులు తన మిత్రుడు హిమాన్షుకు సంబంధించినవని అతను ఆ డబ్బులు అప్పుడే తీసేసుకున్నాడని తెలిపాడు. పోలీసులు హిమాన్షు గురించి విచారణ చేస్తే.. అతను నంద లాల్ కూతరు స్వప్న(14) డాన్స్ టీచర్ అని తెలిసింది. దీంతో ఆ డబ్బులు స్వప్ననే తన తండ్రి ఫోన్ నుంచి హిమాన్షుకు పంపిందని నిరూపితమైంది. అసలు స్వప్నకు అంత డబ్బు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని నంద లాల్ ప్రశ్నించాడు. దీంతో స్వప్న ఒక్కసారిగా ఏడుస్తూ నిజం చెప్పింది.
స్వప్న డాన్స్ నేర్చుకునేందుకు హిమాన్షు వద్దకు అతని డాన్స్ స్కూల్‌కు వెళ్లేది. అక్కడ స్వప్నకు హిమాన్షు కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఇదంతా ఒక మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి ఆమెను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. ఎవరితోనూ ఈ విషయం చెప్పలేక.. తన తండ్రి ఫోన్లో ఉన్న గూగుల్ పే పాస్ వర్డ్ తెలుసుకొని దొంగచాటుగా రూ.19,000 హిమాన్షు చెప్పిన నెంబర్‌కు పంపించింది.
నిజం తెలుసుకున్న పోలీసులు హిమాన్షు మొబైల్ ఫోన్ తీసుకొని పరిశీలించగా.. అందులో ఇలాగే 11 మంది అమ్మాయిల నగ్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు హిమాన్షుని అరెస్టు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- blackm
- Crime
- Dance
- Dance master
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

