మఠంపల్లి : కూలీల ఆటో బోల్తాపడి పలువురికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీలు రఘునాథపాలెం గ్రామంలో పత్తి తీయడానికి వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో రఘునాథపాలెం గ్రామం దాటిన తర్వాత రోడ్డుకు అడ్డంగా పశువులు రావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో 13మంది కూలీలు ఉండగా 9మందిని అత్యవసర చికిత్స నిమిత్తం 108 ద్వారా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యయి. స్థానిక సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించి డాక్టర్ చారి పర్యవేక్షణలో వైద్యం చేయించారు.