జీడిమెట్ల : కుటుంబ కలహాల కార ణంగా భార్యా భర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఓ ప్ర భుత్వ ఉపా ధ్యాయుడు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడి మెట్ల ఎస్ఐ సత్యం తెలిపిన వివరాల ప్రకారం…..వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం హరి దాసుపల్లి గ్రామానికి చెందిన గొల్ల చంద్రశేఖర్ (47)కు శ్రీలతతో 20 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. 20 యేండ్ల క్రితం ఉద్యోగరీత్యా ఐడీఏ బొల్లారం వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. చంద్రశేఖర్ నగరంలోని పాతబస్తీ తలాబ్‌కట్టా నవాబ్సాబ్ కుంట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శ్రీలత ఆబిడ్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నది. చంద్రశేఖర్ బొల్లారం ప్రాంతంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య శ్రీలత తరచూ భర్తతో గొడవ పడుతుండేది.
ఈ మేరకు పలు మార్లు ఆల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో భార్యా భర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్కడి నుంచి చింతల్ శ్రీ సాయినగర్ కాలనీలో ని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు, భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిన అనంతరం ఇం ట్లోని బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య శ్రీలత ఇంటికి వచ్చి చూడగా భర్త ఆత్మహత్య చేసు కున్నట్లు గమనించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం శ్రీలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.