నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్ ఎదురుగా అయ్యప్ప ఫర్నిచర్‌పై అంతస్తు నుంచి కింద పడి అనుమానాస్పద స్థితిలో ఓ యవకుడు మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టింది.
పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని సోదా చేయగా మృతుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా జక్కా అర్జున్‌గా గుర్తించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.