చదువు చెప్పి సమాజంలో గౌరవంగా బతకడం నేర్పించాల్సిన ఉపాధ్యాయుడతను. కానీ కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చూసింది. స్థానికంగా ఒక స్కూల్లో 4వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్ధినిపై అదే పాఠశాల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుడు అత్యాచారయత్నం చేశాడు. ఛత్రినక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జంగమ్మెట్ ప్రాంతలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాధిత బాలిక 4వ తరగతి చదువుకుంటోంది.
అదే స్కూల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుడు అశ్వక్( 35).. ఆ చిన్నారిపై కన్నేశాడు. ఆమెను బలాత్కరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సదరు టీచర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయుడు అశ్వక్( 35)ను అదుపులోకి తీసుకున్నారు.