e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News Crime News | ఉయ్యాల్లో ఇరుక్కొని 9 ఏళ్ల బాలుడి మృతి

Crime News | ఉయ్యాల్లో ఇరుక్కొని 9 ఏళ్ల బాలుడి మృతి

ముంబై: పిల్లాడి కోసం ఇంట్లో వేసిన ఉయ్యాలే ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది. ఉయ్యాల్లో ఆడుకుంటున్న ఆ బాలుడు దానిలోనే చిక్కుకొని మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది. అంధేరీ వెస్ట్‌లో ఒక ఇంట్లో ఈ ఘటన జరిగింది.

తల్లి అదే గదిలో మరోపక్క నిద్రపోతుండగా 9 ఏళ్ల బాలుడు ఇంట్లో వేసిన ఉయ్యాల ఊగుతూ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే ఉయ్యాల తాడులో ఇరుక్కున్నాడు. బయటపడటానికి అతను చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో సరిగా ఊపిరి అందక ఆ బాలుడు కన్నుమూశాడు. దీనిపై యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement