మర్పల్లి : మనస్తాపంతో ఓ వ్యకి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన ఆలురు వినోద్ (25) బంట్వారం మండలం, సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన శిరీషతో కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని రోజుల నుంచి తాగుడుకు బానిసై శిరీషను కొడుతుండే వాడు. ఇరవై రోజుల క్రితం శిరీషను మళ్లీ కొట్టడంతో తల్లి గారింటికీ వెళ్లి అక్కడే ఉంటుంది.
దాంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినోద్ తండ్రి లక్ష్మయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. లక్ష్మయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు.