హయత్‌నగర్ రూరల్ : ఎట్టకేలకు హత్య మీస్టరీ వీడింది. తారామతిపేట మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి బుధవారం వివరాలు వెళ్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ అమాయక మహిళను హత్య చేసి నగలను తస్కరించి పరారైన ఘటన పాఠకులకు విధితమే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు తాగిన మైకంలో మహిళపై లైంగికదాడికి పాల్పడి, ఆపై ఆమెను కిరాతకంగా కొట్టి చంపారు. చనిపోయిందని నిర్ధారించుకుని ఆమెపై ఉన్న బంగారు అబరణాలను తీసుకెళ్లారు. పోలీసులు నిందితులు ఇద్దరు శ్రీకాంత్, సురేశ్‌ను బుధవారం అరెస్టు చేశారు. విరిద్దరిని విచారించగా నేరాన్ని అంగీకరించారు.
ఈ హత్య కేసులో భర్త హస్తం ఉందని అనుమానాలు ఉన్నాయని భర్తను సైతం విచారణ చేసిన అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్తామని పేర్కొన్నారు. నిందితులను చకచక్యంగా పట్టుకున్న సీఐ స్వామి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.