అక్రమంగా లిక్కర్ అమ్ముతున్న వారిపై చర్య తీసుకొమ్మని అడగడమే అతడు చేసిన పాపమైపోయింది. అక్రమార్కులపై చర్య తీసుకోకుండా కంప్లెయింట్ ఇచ్చిన దివ్యాంగుడిని విచక్షణారహితంగా చితకబాదారు తమిళనాడు రాష్ట్రంలోని పుడ్డుకొట్టాయ్ జిల్లా పోలీసులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు.. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్య తీసుకున్నారు. కాగా, ఈ వార్త తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది.
సీనియర్ పోలీస్ అధికారుల కథనం మేరకు.. తన ఏరియాలో కొందరు అక్రమంగా లిక్కర్ అమ్ముతున్నారని ఓ దివ్యాంగుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, కంప్లైంట్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆ దివ్యాంగుడిని విరాలిమాలై పోలీస్ట్స్టేషన్కు తీసుకెళ్లారు. ముగ్గురు కానిస్టేబుళ్లు అతడిని విచక్షణారహితంగా కొట్టారు. కాగా, బాధితుడు ఈ విషయంపై ఐజీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. బాధ్యులైన ముగ్గురు కానిస్టేబుళ్లను రిజర్వ్ ఫోర్స్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.