మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Apr 11, 2020 , 13:34:03

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

మేడ్చల్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి పోలీసులు ఆపుతున్నా ఆపకుండా సురారం వైపు వెళ్లాడు. దీంతో కానిస్టేబుల్‌ మరో బైక్‌పై అతడిని వెంబడించాడు. కాగా సురారం కట్టమైసమ్మ చెరువు మలుపు వద్ద ఇరువురు అదుపుతప్పి కిందపడ్డారు. ఈ దుర్ఘటనలో దుండిగల్‌ కానిస్టేబుల్‌ రామచంద్రయ్య తలకు బలమైన గాయం తగిలింది. వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసు సిబ్బంది గాయపడ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు.


logo