College Student Dies | తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ : విద్యార్ధిని మృతి
అమెరికాలోని నాష్విల్లే క్యాంపస్లో 18 ఏండ్ల విద్యార్ధిని (College Student Dies) నడుచుకుంటూ వెళుతుండగా తలపై బుల్లెట్ తగిలి కుప్పకూలింది.
న్యూయార్క్ : అమెరికాలోని నాష్విల్లే క్యాంపస్లో 18 ఏండ్ల విద్యార్ధిని (College Student Dies) నడుచుకుంటూ వెళుతుండగా తలపై బుల్లెట్ తగిలి కుప్పకూలింది. విద్యార్ధిని జులియన్ లుడ్విగ్ మంగళవారం ఎడ్జ్హిల్ కమ్యూనిటీ మెమోరియల్ గార్డెన్స్ పార్క్లో ట్రాక్పై నడుస్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయిందని మెట్రో నాష్విల్లే పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.
నాష్విల్లేలోని బెల్మంట్ యూనివర్సిటీ విద్యార్ధిని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరగా అర్ధరాత్రి మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అనుమానితుడు షకీల్ టేలర్ (29)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టేలర్ కారుపై కాల్పులు జరపగా ఆ సమయంలో అటుగా వెళుతున్న విద్యార్ధిని తలపైకి బుల్లెట్ దూసుకెళ్లడంతో కుప్పకూలింది. ఘటన జరిగిన గంట వరకూ ఆమెను ఎవరూ గుర్తించలేదు. అటుగా వెళుతున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. విషమ పరిస్ధితిలో ఆమెను వండర్బిల్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు తరలించారు.
Read More :
Heavy Rains | తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు, పలు రైళ్లు రద్దు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

