అమరావతి : ఏపీలోని నెల్లూరు( Nellore) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ( RTC Bus ) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ తొక్కుతున్న తమ్ముడు ప్రదీప్(9) ప్రాణాలతో బయటపడగా సైకిల్ వెనుక కూర్చొన్న అన్న కిరణ్(11) బస్ టైర్ కింద పడి మృతి చెందాడు.
ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.