పాట్నా: ఒక వ్యక్తి ఇద్దరు బాలికలను మూడంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఒక బాలిక మరణించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. బజార్ సమితి ప్రాంతంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఇద్దరు బాలికలను కిందకు తోసేశాడు. దీంతో ఒక బాలిక అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో బాలికను ఆసుపత్రిలో చేర్చారు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. స్థానికులు నిరసనకు దిగారు. ఆందోళనకు దిగిన కొందరు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. కాగా, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి స్థానికుడు కాదని కౌన్సిలర్ సతీష్ కుమార్ తెలిపారు. అరెస్టైన వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదన్నారు.