ఖమ్మం: కొంతమంది వ్యక్తులు Dial-100 కు అవగాహన లేక ఫేక్ కాల్స్ చేస్తున్నారని అలా చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే Dial – 100 కు ఫోన్ చేయాలని అటువంటి సమయంలో పోలీస్ వారి నుంచి 24×7 గంటలూ సహాయం పొందవచ్చని తెలిపారు.
సమాజంలో పెరిగి పోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన , మాన , ప్రాణాల రక్షణే ద్వేయంగా ఏర్పాటైన Dial – 1O0 కు నవంబరు నెలలో 1,476 కాల్స్ వచ్చాయని , వాటిపై ” 62 ” F.I.R. లు నమోదు చేశామని , వీటిలో మహిళలపై వేధింపులు – 2 , దొంగతనాలు- 5 , సాధారణ ఘూటనలు- 15 , ఏక్సిడెంట్లు -21 , అనుమానాస్పద మరణాలు -12 , ఇతర కేసులు – 7 అని పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ తెలిపారు.