షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్ | Drugs Case.. Aryan Khan
క్రూయిజ్ డ్రగ్ పార్టీ కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్చిట్ ఇచ్చింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను గత ఏడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. న్యాయస్ధానాల్లో వాదోపవాదాలు, 26 రోజుల పాటు కస్టడీ అనంతరం అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
ముంబై : క్రూయిజ్ డ్రగ్ పార్టీ కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్చిట్ ఇచ్చింది. ఆర్యన్‌పై ఆరోపణలకు తగిన ఆధారాలు లభించనందున అతడిని కేసు నుంచి తప్పించినట్టు ఎన్సీబీ తెలిపింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను గత ఏడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. న్యాయస్ధానాల్లో వాదోపవాదాలు, 26 రోజుల పాటు కస్టడీ అనంతరం అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
ఆపై తన తండ్రి బర్త్‌డేకు ముందు అక్టోబర్ 30న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చాడు. క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడుల్లో ఆర్యన్ ఖాన్ సహా 19 మందిని అరెస్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయీల్ (37) గుండెపోటుతో మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభాకర్ తన నివాసంలోనే గుండెపోటుతో చనిపోయినట్టు అతడి తరఫు లాయర్ తుషార్ ఖండారే వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదని లాయర్ చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Aryan Khan
- Case
- cruise drugs
- NCB
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

