హైదరాబాద్ : సినీనటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన నిందితుడు కొమ్ము బాబును టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిని విషయం తెలిసిందే. కాగా, కేబీఆర్ పార్కు వద్ద జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సినీ నటి షాలూ చౌరసియా మీద దాడి చేసిన నిందితుడిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిందితుడు కొమ్ము బాబు నవంబర్ 2న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వకుంటే లైంగికదాడి చేస్తా అని బెదిరించి సదరు యువతిని నుంచి రూ.2500 లాక్కున్నాడు.
అయితే భయంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, నిందితుడు బాబు అరెస్ట్ కావడంతో శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.