భార్య, కుమార్తెతో సహా బిల్డింగ్ 12వ అంతస్తు నుంచి దూకిన పోలీస్… ముగ్గురూ మృతి
అహ్మదాబాద్: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్య, కుమార్తెతో సహా బిల్డింగ్ 12వ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. ఈ సంఘటనలో వారు అక్కడికక్కడే మరణించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ కులదీప్సింహ్ యాదవ్, అహద్మాబాద్లోని వస్త్రపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య రిద్ధి, మూడేళ్ల పాపతో కలిసి గోటా ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు.
అయితే ఆ దంపతులు తరచుగా గొడవ పడేవారని పొరుగువారు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా కులదీప్సింహ్ యాదవ్, రిద్ధి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉదయం 1.30 గంటలకు తొలుత భార్య రిద్ధి అపార్ట్మెంట్ బిల్డింగ్ 12వ అంతస్తు నుంచి కిందకు దూకింది. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ యాదవ్, కుమార్తె అయిన మూడేళ్ల పాపను పట్టుకుని అక్కడి నుంచి కిందకు దూకాడు. ఆ ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అదే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

