Pond : చెరువులో పడి యువకుడు మృతి

భువనగిరి కలెక్టరేట్ : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హుస్సేనాబాద్‌కు చెందిన సాయికుమార్(27) ఈ నెల 28న పట్టణంలోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో సంఘటన విషయం బయటకు తెలియలేదు. కాగా మృతదేహం నీటిపై తేలి ఉండటాన్ని స్థానికులు గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. మృతుడు సాయికుమార్ గత నెలలో పట్టణంలోని స్టేషన్‌రోడ్డులో గల ఏటీఎం చోరీకి పాల్పడి జైలు నుంచి విడుదలయ్యాడని, మృతుడికి భార్య కుమారుడు ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

