నల్లగొండలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతిపై దాడి చేసిన యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన రోహిత్(21) అనే యువకుడు ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదవుతున్నాడు. అయితే నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో రోహిత్ వేధింపులకు గురి చేస్తున్నాడు. రోహిత్ ప్రేమ ప్రతిపాదనను గత ఏడు నెలల నుంచి నవ్య తిరస్కరిస్తూ వచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠతో కలిసి స్థానికంగా ఉన్న ఫారెస్ట్ పార్కుకు వచ్చింది. ఆ పార్కులో సాయి అనే ఫ్రెండ్‌తో నవ్య, శ్రేష్ఠ మాట్లాడుతుండగా.. రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు. నవ్యతో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి.. పార్కులోనే మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు రోహిత్. ఇక తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
అనంతరం రోహిత్ తన బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సాయి, శ్రేష్ఠ కలిసి నవ్యను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

